కాంగ్రెస్ ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడుతుంది….

-

నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడుతుందని గిరిజన శాఖ మంత్రి సీతక్క తెలిపారు. సచివాలయంలో క్రిస్టియన్ ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా… మంత్రి సీతక్క మాట్లాడుతూ లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పండుగ గా ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ అని తెలియజేసింది. విద్య ,వైద్య రంగాలలో పలువురు క్రిస్టియన్స్ వివిధ సేవలు అందిస్తున్నారని రాష్ట్రంలో వారికి రక్షణ కల్పిస్తామని తెలియజేశారు. అలాగే ప్రజలందరూ శాంతి సోదర భావంతో మెలగాలని కోరారు.

ఈ సమావేశానికి ఎడ్వర్డ్ ముఖ్య వక్తగా విచ్చేసి కేక్ ని కట్ చేశాడు. అనంతరం విలియమ్స్ మాట్లాడుతూ పాపులను శిక్షించడానికి ప్రభువు లోకంలో అవతరించాడని అలాగే ఏసుప్రభువు బోధించిన నీతి వాక్యాలను అందరూ పాటించాలని కోరాడు. అలాగే క్రిస్మస్ యొక్క విశిష్టతను వివరించాడు. మ్యూజిక్ డైరెక్టర్ పిజెడి ఆధ్వర్యంలో చర్చిలోని సభ్యులు ఏసుక్రీస్తు పాటలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం లోని ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news