వచ్చే జనవరి నెలలో శ్రీరాముని యొక్క జన్మభూమి అయిన అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకని చూడడానికి చాలామంది భక్తులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. కాగా తెలంగాణ నుండి అయోధ్యకి ప్రత్యేక రైళ్లు నడపాలని భాజపా చూస్తున్నట్లు సమాచారం. అలాగే అయోధ్యకి ప్రతి లోక్సభ నియోజకవర్గ నుండి కూడా రైళ్లను నడపాలని భావిస్తుంది. దీనికోసం బిజెపి కసరత్తులు చేస్తుంది. జనవరి 22 తర్వాత తెలంగాణ నుండి అయోధ్యకు ఏర్పాటు చేసే ప్రత్యేకమైన రైళ్లకు షెడ్యూల్ ఖరారు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరం ప్రారంభ ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరియు సినీ ప్రముఖులు ఈ ప్రారంభ ఉత్సవానికి హాజరు కాబోతున్నారు.
ఇదిలా ఉండగా రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన భద్రత ఏర్పాట్లకి బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు కూడా ప్రతి వీధిలోను మొహరిస్తారు.