కాల్షియం లోపం ఏమో అని సందేహమా..? ఈ లక్షణాలతో గుర్తించచ్చు మరి…!

-

ఒక్కొక్కసారి మనకి వచ్చే కొన్ని సమస్యల వలన అనుమానాలు వస్తూ ఉంటాయి. సమస్యలు ఏమైనా ఉన్నాయా..? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క సారి క్యాల్షియం లోపం ఏమో అని సందేహం కలుగుతుంది. మీకు కూడా క్యాల్షియం లోపం ఏమో అని సందేహం ఉందా..?

క్యాల్షియం లోపం ఉంటే బోన్ మాస్ తగ్గి ఆస్టియో పోరిసిస్ సమస్య వస్తుంది అలానే జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది మెమరీ లాస్ వస్తుంది. ఒకవేళ కనుక మీకు కాల్షియం తగ్గిందని అనిపించినా క్యాల్షియం లోపం ఉందని అనుకుంటున్నా ఇలా తెలుసుకోవచ్చు. కాలుష్యం లోపం ఉంటే ఈ సంకేతాలు కనపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

కాల్షియం లోపం వల్ల ఎదురయ్య సమస్యలు:

కండరాలు పట్టేయడం
చేతులు కాళ్లు తిమ్మిర్లు ఎక్కడం
గోళ్లు చాలా బలహీనంగా కనపడడం
ఎముకలు ఈజీగా ఫ్రాక్చర్ కి గురి కావడం

ఎవరికి క్యాల్షియం లోపం వస్తుంది…?

ఎక్కువగా కాల్షియం లోపం 10 నుండి 18 ఏళ్ల వయసు వాళ్ళకి ఉంటుంది.
ప్రెగ్నెన్సీ వారిలో కూడా క్యాల్షియం లోపం కలిగే ఛాన్స్ ఉంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయం లో క్యాల్షియం టాబ్లెట్స్ ని ఇస్తారు.

క్యాల్షియం ని ఎలా పొందాలి..?

క్యాల్షియం గోధుమ పిండి, కంది పప్పు, సజ్జలు, రాగులు, మినప పప్పు, పెసర పప్పు, ఉలవలు ద్వారా పొందొచ్చు. అలానే మునగాకు, కరివేపాకు, తోటకూర, నువ్వులు, వేయించిన పల్లీలు, మాంసం లో కూడా ఉంటుంది. గేదె పాలు, ఆవు పాలు, గుడ్డు ద్వారా కూడా క్యాల్షియం ని మనం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version