కుమారి ఆంటీ…. యూటూబ్ ఫుడ్ వ్లాగర్స్ పుణ్యమా అని ఈ పేరు ఈ మధ్యన సోషల్ మీడియాలో విపరీతంగా మారుమోగుతుంది.మీది మెుత్తం 1000 అయింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా’ అంటూ తెగ వైరల్ అయింది.అయితే ట్రెండింగ్లో ఉన్న కుమారీ ఆంటీ ఫుడ్ బిజినెస్కు దెబ్బపడింది. సోషల్ మీడియాలో ఫుడ్ సెంటర్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఆమె వద్దకు వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అవడం, పర్మిషన్ లేదనే కారణాలతో ఫుడ్ సెంటర్ను తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశించినట్లు కుమారీ ఆంటీ తెలిపారు. మరోవైపు తమ డ్యూటీ తాము చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని గుడివాడకు చెందిన దాసరి సాయి కుమారి.. 2011లో స్ట్రీట్‌ఫుడ్ సెంటర్‌ను హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె తన స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించింది. టేస్టీ వెజ్, నాన్‌వెజ్ వంటకాలను అందిస్తూ ఆమె మంచి పేరు సంపాదించారు. ఐదు కేజీల రైస్ తో మొదలైన ఆమె ప్రయాణం తాజాగా 100 కేజీల రైస్ కు చేరుకుంది.