“కృతిసనన్ కు డైరెక్టర్ ముద్దు”… స్పందించిన రామాయణంలో సీత!

-

తాజాగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తిరుపతి లో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫంక్షన్ లో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు పలు వివాదాలకు తావు అయింది. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ మరియు ఈ సినిమాలో సీతగా నటించిన కృతి సనన్ లు ముద్దు పెట్టుకోవడం అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ విషయంపై రామాయణం సీరియల్ లో సీతగా నటించిన దీపికా స్పందించింది. ఈమె మాట్లాడుతూ మా కాలంలో ఈ విధంగా అస్సలు ఉండేది కాదు, సీత గా చేసిన మా పాత్రలోనే సహనటులు కావొచ్చు లేదా డైరెక్టర్ కపోవచ్చు దేవుళ్లను చూసేవారు, షూటింగ్ స్పాట్ లో మా పాదాలకు నమస్కారం కూడా చేసేవారు.

కానీ ఇప్పుడు చూస్తుంటే అంతా గందరగోళంగా ఉంది.. మేము కౌగిలించుకోవడం లేదా ముద్దులు పెట్టుకోవడం ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి ఘటనలు ఖచ్చితంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయంటూ ఆవేదన చెందింది.

Read more RELATED
Recommended to you

Latest news