రాజ్యసభ ఎన్నికల ముందు టీడీపీకి షాక్.. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం

-

ఆంధ్రప్రదేశ్  రాజకీయాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారాయి. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు కూడా ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు రాజీనామాకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా ఆమోదం తెలిపారు. ఈనెల 22న గంటా రాజీనామా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పేర్కొన్నారు.

ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ గెజిట్ నోఫికేషన్ విడుదల చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. 2022 ఫిబ్రవరిలో గంటా శ్రీనివాసరావు తమ ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామాను పెండింగ్ లో పెట్టిన స్పీకర్ తీరా ఎన్నికల ముంగిట రాజీనామాకు ఆమోదం తెలపడం ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  ఏపీలో ఖాళీ కానున్న 3 రాజ్యసభ స్థానాలకు మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి షాక్ ఇచ్చేలా వైసీపీ ప్రభుత్వం భారీ స్కెచ్ వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news