జగిత్యాల జిల్లా కొండగట్టు బస్సు ప్రమాదానికి గల కారణాలను ఆర్టీసీ గురువారం వెల్లడించింది. బస్సు డ్రైవర్ శ్రీనివాస్ గట్టు దిగుతున్న క్రమంలో ఓ వ్యాన్ను ఢీకొటిన కంగారులో బ్రేకుకు బదులు ఎక్సలేటర్ని తొక్కడంతో బస్సు మరింత వేగం పెరిగిందన్నారు. వేగానికి తోడు కొండగట్టు మలుపులు.. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో బస్సు అదుపుతప్పి లోయలో పడిందని ఆర్టీసీ అధికారులు నిర్థారించారు. ఈ ప్రమాదంలో ఇప్పటికే 57 మరణించగా పాతికమందికి పైగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరణించిన వారి మృత దేహాలను చెడిపోకుండా ఉండేందుకు ఆర్టీసీ ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై మృతుల కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర విమర్శలు వెళ్లువెత్తిన సంగతి తెలిసిందే.