కొత్త సంవత్సరం వేడుకలు.. ప్రభాస్‌ను వాడేసిన హైదరాబాద్ పోలీసులు.. వైరల్ వీడియో చూశారా?

-

మరికొన్ని గంటల్లో 2023 ముగుస్తుంది. న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధం అవుతున్నారు.మందు తాగిన తర్వాత వాహనాలు నడిపి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోకుండా ఉండడానికి పలు అవగాహన కార్యక్రమాలు పోలీసులు నిర్వహిస్తున్నారు. పోలీసులు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రం తగ్గడం లేదు.

ఈ నేపథ్యంలో పోలీసులు మందుబాబులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకోసం తాజాగా ప్రభాస్ నటించిన సలాడ్ సినిమాలోని డైలాగులు పోలీసులు వాడుకున్నారు. సలార్ చిత్రంలో ‘ముట్టుకోవద్దని చెప్పాను కదరా’ అని ప్రభాస్ నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్ బాగా పాపులర్ అయింది. మందు తాగుతూ డైరెక్ట్ గా వాహనాలు నడపొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మద్యం తాగి వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కొన్ని విజువల్స్‌ కూడా పోలీసులు జత చేశారు. అంతేకాక ‘ప్లీజ్ ఐ కైండ్ లీ రిక్వెస్ట్’ డైలాగ్ ను చివరిలో జత చేశారు. ప్రస్తుతం పోలీసులు వాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

Read more RELATED
Recommended to you

Latest news