మూడు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ హోటల్ వద్ద తుపాకీతో వీరంగం సృష్టించిన బీఎస్పీ నేత రాకేశ్ పాండే కుమారుడు ఆశిష్ పాండే గురువారం ఢిల్లీ పటియాలా కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. మూడు రోజుల క్రితం నైట్‌క్లబ్‌లో పార్టీ అనంతరం అక్కడకు వచ్చిన వారిని బెదిరిస్తూ…. ఓ యువతికి తుపాకీ చూపిస్తూ ఆమెను బెదిరించాడు. సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యువతి పిర్యాదు మేరకు ఆశిష్‌పై పోలీసులు కేసునమోదు చేసి నాన్‌బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేశారు. దీంతో చేసేదేమి లేక న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఆశిష్ మాట్లాడుతూ…. ఆ రోజు నా తప్పు ఏ మాత్రం లేదన్నాడు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తే విషయం అందరికి అర్థం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. న్యాయ స్థానంపట్ల తనకు అపారమైన గౌరవం ఉంది కాబట్టి లొంగిపోతున్న అని పేర్కొన్నారు.