నాన్న పాత్ర చేయడం గర్వంగా ఉంది: కళ్యాణ్ రామ్

దసరా సందర్భంగా ఎన్‌టీఆర్ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా నటిస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా రానుంది. మొదటి పార్ట్ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. మూవీ షూటింగ్ ప్రారంభం నుంచి ఒక్కో పాత్రకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేసుకుంటూ వస్తోంది మూవీ యూనిట్. ఇవాళ ఎన్టీఆర్ ప్రచార రథం సారథి హరికృష్ణ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్ తన తండ్రి హరికృష్ణ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తన ట్విట్టర్ ఖాతాలో నందమూరి కళ్యాణ్ రామ్.. ఆ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఆ పోస్టర్‌లో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ కూడా కనిపించడంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పోస్టర్‌తో పాటు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కళ్యాణ్‌రామ్.. నాన్న పాత్ర చేయడం ఎంతో గర్వంగా, భావోద్వేగంగా ఉందని తెలిపాడు.