కోహ్లీకి రాజీవ్ ఖేల్ రత్న…క్రీడా పురస్కారాలను ప్రకటించిన కేంద్రం

-

వెయిట్ లిఫ్టర్..మీరాభాయి ఛానుకు రాజీవ్ ఖేల్ రత్న

కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరానికి గాను క్రీడారంగంలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన వారికి గురువారం పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది కోహ్లీతో పాటు వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి ఛాను ఖేల్‌రత్నను అందుకోనుంది.. అథ్లెట్స్‌ నీరజ్‌ చోప్రా, హిమాదాస్‌, మహిళా క్రికెటర్‌ స్మృతి మంధానకు అర్జున అవార్డు ప్రకటించారు. ఈ ఏడాది మొత్తం 20 మంది అర్జున, నలుగురికి ధ్యాన్‌చంద్‌, 8 మందికి ద్రోణాచార్య పురస్కారాలు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.

అవార్డుతో పాటు ఖేల్‌ రత్న గ్రహీతలకు రూ. 7.5లక్షలు, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీతలకు రూ. 5లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు.

క్రీడా పురస్కారాల గ్రహీతలు…

* రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న: 

  1. మీరాబాయి ఛాను – వెయిట్‌లిఫ్టింగ్‌
  2. విరాట్‌ కోహ్లీ – క్రికెట్‌

* ద్రోణాచార్య అవార్డు:

  1. సుబేదార్‌ చెనంద అచ్చయ్య కట్టప్ప – బాక్సింగ్‌
  2. విజయ్‌ శర్మ – వెయిట్‌లిఫ్టింగ్‌
  3. ఎ. శ్రీనివాసరావు – టేబుల్‌ టెన్నిస్‌
  4. సుఖ్‌దేవ్‌ సింగ్‌ పన్ను – అథ్లెటిక్స్‌
  5. క్లారెన్స్‌ లోబో – హాకీ(లైఫ్‌టైమ్‌)
  6. తారక్‌ సిన్హా – క్రికెట్‌(లైఫ్‌టైమ్‌)
  7. జీవన్‌ కుమార్‌ శర్మ – జూడో(లైఫ్‌టైమ్‌)
  8. వీఆర్‌ బీడు – అథ్లెటిక్స్‌(లైఫ్‌టైమ్‌)

* అర్జున అవార్డు:

  1. నీరజ్‌ చోప్రా – అథ్లెటిక్స్‌
  2. సుబేదార్‌ జిన్సన్‌ జాన్సన్‌ – అథ్లెటిక్స్‌
  3. హిమా దాస్‌ – అథ్లెటిక్స్‌
  4. ఎన్‌. సిక్కీరెడ్డి – బ్యాడ్మింటన్‌
  5. సుబేదార్‌ సతీశ్‌ కుమార్‌ – బాక్సింగ్‌
  6. స్మృతి మంధాన – క్రికెట్‌
  7. శుభాంకర్‌ శర్మ – గోల్ఫ్
  8. మన్‌ప్రీత్‌ సింగ్‌ – హాకీ
  9. సవిత – హాకీ ‌
  10. కల్నల్ రవి రాథోడ్‌ – పోలో
  11. రహీ సర్నోబత్‌ – షూటింగ్‌
  12. శ్రేయాసి సింగ్‌ – షూటింగ్‌
  13. మనికా బత్రా – టేబుల్‌ టెన్నిస్‌
  14. సతియాన్‌ – టేబుల్‌ టెన్నిస్‌
  15. రోహన్‌ బోపన్న – టెన్నిస్‌
  16. సుమిత్‌ – రెజ్లింగ్
  17. పూజా కడియన్‌ – వుషు
  18. అంకుర్‌ ధమా – పారా అథ్లెటిక్స్‌
  19. మనోజ్‌ సర్కార్‌ – పారా బ్యాడ్మింటన్‌
  20. అంకుర్‌ మిట్టల్‌ – షూటింగ్‌

* ధ్యాన్‌చంద్‌ అవార్డు:

  1. సత్యదేవ్‌ ప్రసాద్‌ – ఆర్చరీ
  2. భరత్‌ కుమార్‌ ఛెత్రీ – హాకీ

3. బాబీ అలోయ్‌సియస్‌ – అథ్లెటిక్స్‌

  1. చౌగలే దాదు దత్తాత్రేయ – రెజ్లింగ్‌

Read more RELATED
Recommended to you

Latest news