పాముకు ఎంఆర్ఐ స్కాన్ చేశారు.. లేజర్ ట్రీట్ మెంట్ కూడా..!

-

ఏందిది.. ఎక్కడైనా మనుషులకు ఎంఆర్ఐ స్కాన్ లాంటిది.. లేజర్ ట్రీట్ మెంట్ లాంటివి చేస్తారు కానీ.. పాముకు చేయడమేంది విడ్డూరంగా ఉందే అంటారా? మీకు ఇది ఎంత విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. అవును.. ముంబైలో ఈ వింత ఘటన చోటు చేసుకున్నది.

ముంబైలోని దహిసర్ ప్రాంతంలో ప్రమాదకరమైన ఓ పాము సంచరిస్తుందన్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలిసింది. దీంతో వాళ్లు భయబ్రాంతులకు గురయ్యారు. ఇంతలో ఆ పాము ఒకరి ఇంట్లో దూరింది. దీంతో ఆ కాలనీ వాసులు స్నేక్ రెస్క్యూ టీమ్ కు సమాచారం అందించారు. ఇంతలో ఓ వ్యక్తి ఉండబట్టలేక ఆ పామును కర్రతో కొట్టాడు. దీంతో దాని నడుము బాగంలో గాయాలయ్యాయి. అది పాకలేకపోయింది. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం ఆ పామును తీసుకెళ్లి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ పామును పరిశీలించిన డాక్టర్ వెన్నుముకకు ఎటువంటి సమస్యా లేదని గుర్తించాడు. కానీ.. ఆ పాము ఎంతకీ పాకలేకపోవడంతో.. దానికి ఎంఆర్ఐ స్కాన్ తీసి దాని వెన్నుముక దెబ్బతిన్నట్టు గుర్తించారు. అనంతరం దానికి కోల్డ్ లేజర్ ట్రీట్ మెంట్ ద్వారా గాయానికి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆ పాము కోలుకుంటోంది. ఇక.. సాధారణంగా మనుషులకు ఉపయోగించే ఎంఆర్ఐ స్కాన్ మిషన్ మీదనే దానికి కూడా స్కానింగ్ చేశారు వైద్యులు. ఇలా పామును ఎంఆర్ఐ స్కాన్ చేయడం తమ హాస్పిటల్ లో ఇదే మొదటిసారని వాళ్లు చెప్పారు. ఇక.. ఆ పాముకు ఎంఆర్ఐ స్కాన్ తీస్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)

Read more RELATED
Recommended to you

Latest news