ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద శనివారం ఉదయం ఫోర్డ్ ఫిగో కారు బీభత్సం సృష్టించింది. ఎర్రమంజిల్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ ఎక్కుతుండగా అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అటుగా వచ్చిన మార్నింగ్ వాకర్స్ క్షతగాత్రులను కారు నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.