గుల్బాదిన్‌ హాఫ్‌ సెంచరీ.. భారత్‌ ముందు టఫ్‌ టార్గెట్‌..

-

భారత్‌-అఫ్గాన్‌ మధ్య ఇండోర్‌ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్‌ కి దిగిన అఫ్గానిస్తాన్‌.. ఇండియా ఎదుట పోరాడగలిగే లక్ష్యాన్ని నిలిపింది. ఆఫ్ఘనిస్తాన్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగుల స్కోర్ చేసి ఆలౌట్‌ అయింది. ఇండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టినా గుల్బాదిన్‌ నయీబ్‌ (35 బాల్స్ లో 57, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కరీమ్‌ జనత్‌ (10 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్సర్‌),ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (9 బంతుల్లో 21, 2 పోర్లు, 2 సిక్సర్లు),నజీబుల్లా జద్రాన్‌ (21 బంతుల్లో 23, 1 ఫోర్‌) రాణించారు. ఆరంభ ఓవర్లలో అఫ్గాన్‌ను కట్టడి చేసి వికెట్లు తీసినా భారత బౌలర్లు కీలక సమయంలో రన్స్ సమర్పించుకున్నారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు (32/3), బిష్ణోయ్‌ (39/2) ,అక్షర్‌ పటేల్‌ (17/2) , శివమ్‌ దూబే (17/1) తో రాణించారు.

 

మొదట బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గానిస్తాన్‌కు మూడో ఓవర్లో వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ అయిన ఓపెనర్‌ రెహ్మనుల్లా గుర్బాజ్‌ (14)ను బిష్ణోయ్‌ ఔట్‌ చేశాడు. 20 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ కి ఆ తర్వాత ఓవర్లలో అక్షర్‌, దూబేలు డబుల్‌ స్ట్రోక్‌లు ఇచ్చారు. అక్షర్‌ వేసిన ఆరో ఓవర్లో నాలుగో బంతికి కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్‌ (8) బౌల్డ్‌ అవగా అజ్మతుల్లా (2)ను ఆ మరుసటి ఓవర్లోనే దూబే ఔట్ చేశాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన గుల్బాదిన్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ఆఫ్గనిస్తాన్ కి గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news