జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది : కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ

-

వైఎస్ జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు.వైసీపీ ప్రభుత్వములో కేంద్రం భారీగా ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “కేంద్రం ఇచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేయకపోగా, అసలు ఏ ఖాతాలోకి మళ్లించారో కూడా కేంద్రానికి సమాచారం ఇవ్వలేదు అని అన్నారు.

ఆ వివరాలు అందిస్తే గాని మళ్లీ నిధులు విడుదల చెయ్యలేని స్థితిని వైసీపీ తెచ్చింది అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అందుకే కొత్తగా నిధులు ఇచ్చేందుకు ఇబ్బందులు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఏపీ అభివృద్ధిలో తమ పాత్ర కచ్చితంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. ఈ మేరకు రాజధాని అమరావతి అభివృద్ధికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య మీద ఇప్పటికే సమీక్ష నిర్వహించా. ఇకపై తరచూ విశాఖ వస్తూ ఉంటా అని ,స్థానిక సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తా” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version