జేసీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసు అధికారుల సంఘం

-

తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలనీ, ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే నాలుక కోస్తామని పోలీసు అధికారుల సంఘం కార్యదర్శి గోరంట్ల మాధవ్‌ హెచ్చరించారు. పోలీసులు హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారంటూ  జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మేము మగాళ్లం’ అంటూ మీడియా ఎదుట మీసం తిప్పుతూ… తమ ఆత్మస్థైర్యం దెబ్బ తీస్తే సహించేది లేదని పోలీసు అధికారులు మండిపడ్డారు. పోలీసులను హిజ్రాలతో పోల్చడం సభ్యసమాజానికే సిగ్గుచేటని జేసీ వ్యవహారంపై దుమ్మెత్తిపోశారు. జేసీ చేసిన ఆరోపణలను పసంహరించుకుని, బేషరతుగా తమకు క్షమాపణలు చెప్పాలని గోరంట్ల మాధవ్‌ డిమాండ్ చేశారు. కాగా, తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు తమ వర్గీయులపై దాడుల నేపథ్యంలో  పోలీసులు భయపడి పారిపోతున్నారనీ, హిజ్రాల్లా వ్యవహరిస్తున్నారని జేసీ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version