జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది పొరపాటు.. ప్రయాణికుల ముక్కు నుంచి రక్తం

-

జెట్ ఎయిర్ వేస్ విమానం ముంబై నుంచి జైపూర్ వెళ్తోంది. విమానం టేకాఫ్ కూడా అయింది. విమానం ఆకాశంలో దూసుకెళ్తున్నది. ఇంతలో ప్రయాణికులకు భరించలేని తలనొప్పి ప్రారంభమయింది. కొంతమందికి ముక్కు, చెవుల నుంచి రక్తం కారడం ప్రారంభమయింది. ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. అంతా అయోమయం. వెంటనే అందరికీ ఆక్సిజన్ మాస్కులను అందించారు విమానం సిబ్బంది. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి ముంబైలో ల్యాండ్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది బాధితులకు చికిత్స అందించారు. తీవ్రంగా గాయాలైన వారిని… ముక్కు నుంచి ఎక్కువగా రక్తం కారిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తం 166 మంది ప్రయాణికులు ఆ విమానంలో ఉన్నారు.

అదంతా ఓకే కానీ.. అసలు విమానంలోని ప్రయాణికులకు ఒక్కసారిగా ముక్కు నుంచి రక్తం ఎందుకు కారింది.. అనే డౌట్ మీకు వచ్చే ఉంటది. సాధారణంగా ఏ విమానమైనా టేకాఫ్ కాగానే క్యాబిన్ లో ఒత్తిడిని మానిటర్ స్విచ్ ను ఆన్ చేస్తారు సిబ్బంది. కానీ.. ఈ విమానంలో ఆ స్విచ్ ను ఆన్ చేయడం మరిచిపోయారు సిబ్బంది. దీంతో క్యాబిన్ లో ఒక్కసారిగా ఒత్తిడి తగ్గిపోయి ప్యాసెంజర్లకు అలా జరిగిందన్నమాట. ఇంత ఘోర తప్పిదానికి పాల్పడిన విమాన సిబ్బందిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించింది జెట్ ఎయిర్ వేస్. డీజీసీఏ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version