ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ పై జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలిచి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై చెలరేగిపోయారు.రోహిత్ త్వరగా ఔటైనా.. 29 రన్స్ చేసి కోహ్లి పెవిలియన్ చేరినా ఇండియా ఎక్కడా తడబడలేదు. యువ ఓపెనర్ జైస్వాల్ ఆకాశమే హద్దుగా ఆఫ్ఘన్ బౌలర్లను చీల్చి చెండాడు.
34 బంతుల్లో 6 సిక్సులు, 5 బౌండరీలతో 68 రన్స్ చేసి ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. మరో ఎండ్ లో శివమ్ దూబే వరుస సిక్సర్లతో పెను విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరి భారీ భాగస్వామ్యంతో భారత్ సునాయాసంగా విజయాన్ని అందుకుంది. దూబే 32 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్లతో 63 రన్స్ చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 రన్స్ కి ఆలౌటైంది. నైబ్ 35 బంతుల్లోనే 57 పరుగులు చేయగా చివర్లో ముజీబుర్ రెహమాన్ (9 బంతుల్లో 21) ,కరీం జనత్ (10 బంతుల్లో 20) చెలరేగి ఆడారు. ఇండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్ ,బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. దూబేకు ఒక వికెట్ లభించింది.