నా సామిరంగ’ ఏ ఓటీటీలోకి, ఏ ఛానల్ లోకి వస్తుందో తెలుసా?

-

కింగ్ నాగార్జున హీరోగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘నా సామిరంగ’.ఈ మూవీ నేడు జనవరి 14న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల అయింది.ఈ చిత్రంలో అల్లరి నరేష్ రాజ్ తరుణ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. ట్రైలర్, టీజర్ ,సాంగ్స్ తో ఈ సినిమా పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఇక నా సామిరంగ కి మొదటి ఆట నుంచే మంచి స్పందన వస్తోంది. ప్రేమ కథలకు ఎంటర్టైన్మెంట్ తో ఓ రివెంజ్ డ్రామాని జోడించి ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమాలా నా సామిరంగ సినిమా ఇచ్చారు నాగ్. ఇక నా సామిరంగా సినిమా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కూడా విడుదల కి ముందే అమ్ముడు పోయాయి.నా సామిరంగ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు కొనుక్కున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చ్ మొదటి వారంలో ఈ చిత్రం  ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులు స్టార్ మా కొనుక్కుంది.

Read more RELATED
Recommended to you

Latest news