జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీకి క‌రోనా..

-

ప్ర‌స్తుతం క‌రోనా ఎవ‌రినీ వ‌ద‌ల‌ట్లేదు. మ‌రీ ముఖ్యంగా వ‌రుస‌గా టాలీవుడ్ సెల‌బ్రిటీలు క‌రోనా బారిన ప‌డుతున్నారు. అటు వెండితెర‌, ఇటు బెల్లితెర‌తో పాటు అంద‌రినీ కొవిడ్ వెంటాడుతోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాన్‌, అనిల్ రావిపూడి తో పాటు చాలా మందికి క‌రోనా ‌సోకింది. దీంతో చాలా సినిమాలు వాయిదా ప‌డ్డాయి. మ‌రికొన్ని షూటింగుల‌ను నిలిపివేశాయి.


ఇప్పుడు తాజాగా బుల్లితెర‌ను కొవిడ్ షేక్ చేస్తోంది. జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ వ‌ర్ష‌కు క‌రోనా సోకింది. ఈ విషయం గురించి వ‌ర్ష‌నే స్వయంగా సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. ‘ఇలా సడన్ గా లైవ్ లోకి వచ్చానని అందరూ ఆశ్చర్యపోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితి వల్ల ఇలా వ‌చ్చాను అంటూ వ‌ర్ష వివ‌రించింది. రెండు రోజులుగా త‌న‌కు ఆరోగ్యం బాగా లేద‌ని, టెస్టు చేయ‌గా పాజిటివ్ వ‌చ్చింద‌ని తెలిపింది. ప్ర‌స్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని తెలిపింది. హాస్పిట‌ళ్ల‌లో చ‌నిపోయిన వారి శ‌వాల‌ను ప్యాక్ చేసి ప‌డేస్తున్నార‌ని, చూస్తే భ‌య‌ప‌డుతార‌ని చెప్పుకొచ్చింది. రోజూ వేడి నీళ్లు తాగండి జాగ్ర‌త్త‌లు చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news