మ‌హిళా ఆటోడ్రైవ‌ర్‌కు స‌మంత భారీ గిఫ్ట్‌.. సూప‌ర్ అంటున్న ఫ్యాన్స్‌

-

అక్కినేని స‌మంత‌కు అభిమాన‌నుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. ఎందుకంటే ఆమె హీరోయిన్‌గానే కాకుండా అనేక ర‌కాల సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంది. ఇప్ప‌టికే ప్ర‌త్యూష ఫౌండేష‌న్ తో ఎంతో మంది అనాథ‌ల‌కు సాయం చేస్తోంది. దీంతో ఆమెకు ఎక్క‌డా లేని క్రేజ్ ఏర్ప‌డింది. ఒక‌నొక టైమ్ లో స‌మంత త‌న కోడ‌లు కాకముందు నాగార్జున సైతం ఓ ప్రోగ్రామ్‌లో స‌మంత సేవ‌ల‌ను కొనియాడాడు.]


ఇక అక్కినేని వారి ఇంటి కోడ‌లు అయ్యాక కూడా త‌న స‌సేవా కార్య‌క్ర‌మాల‌కు ఎక్క‌డా అడ్డు లేకుండా ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోతోంది. ముఖ్యంగా ఒంట‌రి మ‌హిళ‌ల‌కు, అనాథ‌ల‌కు, చిన్న పిల్ల‌ల‌కు ‌సాయం అందిస్తోంది. ఇక ప్ర‌స్తుతం ఈమె తెలంగాణ‌లోని ఓ మ‌హిళ‌కు చేసిన సాయం స‌సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం డోవూర్‌ చందర్‌ నాయక్‌ తండాకు చెందిన ఓ మ‌హిళా ఆటో డ్రైవ‌ర్ కు స‌స‌మంత ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చింది. ఆటో డ్రైవర్‌ కవిత త‌న కుటుంబ పోషణ కోసం ఏకంగా 16 ఏళ్లుగా ఆటో నడుపుతోంది. త‌న జీవింతో ఎన్నో అవమానాలు, క‌ష్టాల‌ను ఎదుర్కొన్నానని కవిత చెప్పింది. ఇక త‌న తల్లిదండ్రులు సహా పది మందితో కూడిన కుటుంబాన్ని ఆటో న‌డుపుతూ పోషిస్తోంది. ఈ మ‌ధ్య‌ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ టీవీ ప్రోగ్రాంలో ఆటో డ్రైవ‌ర్ కవిత పాల్గొంది. ఆమె జీవిత చరిత్రను ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులు.. యూ ట్యూబ్‌లో వీడియో విడుద‌ల చేశారు. ఇక‌ కవిత కష్టాన్ని ఆ వీడియో ద్వారా తెలుసుకున్న సమంత, ఆమెకు కారును గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో స‌మంత‌కు ఎక్క‌డా లేని ప్ర‌శంస‌లు అందుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news