చంద్రబాబుకు వైఎస్ జగన్ బర్త్ డే విషెస్ !

-

పొద్దున లేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబును తూర్పారబట్టే  వైఎస్ జగన్ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు పుట్టినరోజు కావడంతో ఆయనకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు వైఎస్ జగన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.

“చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు ఆ దేవుని ఆశీస్సులతో నిండు ఆరోగ్యంతో మీరు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అని జగన్ పేర్కొన్నారు. ఇక చంద్రబాబుకు పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి సహా చాలా మంది సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే వైఎస్ జగన్ శుభాకాంక్షలు మాత్రం ఆసక్తికరంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news