టీఎస్‌పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 18 లోపు అప్లై చేసుకోవచ్చు. అలాగే www.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఆ దరఖాస్తులను ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు [email protected] మెయిల్‌కు పంపించవచ్చని తెలిపారు. ఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొంది.
ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలత చెందిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఈరోజు గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బీ జనార్ధన్‌రెడ్డి, సభ్యులు ఆర్ సత్యనారాయణ,బండి లింగారెడ్డి, కారం రవీందర్‌రెడ్డిలు రాజీనామాలు సమర్పించారు. వీరి రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. కోట్ల అరుణకుమారి ఒక్కరే ప్రస్తుతం కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.