Title : ప్రభాస్ -మారుతి సినిమా టైటిల్ ఇదా?

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇక ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సైలెంట్ గా షూటింగ్ మొదలు పెట్టాక మూవీ గురించి రివీల్ చేశారు.. యువి క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.ఓ వైపు పాన్ ఇండియా డైరెక్టర్స్ తో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ మారుతితో మూవీ చేయడం ఏంటని డార్లింగ్ అభిమానులకు మొదట నిరాశను కలిగించింది. అయితే కథ నచ్చడంతో ఈ మూవీ కి ఓకే చెప్పినట్లు ప్రభాస్ చెప్పడంతో సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో తెర మీద ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి..

అయితే మొదట రాజా డీలక్స్ అనే టైటిల్ ఈ మూవీకి ఖరారు చేసినట్లు ప్రచారం లో ఉంది. ఆ తర్వాత రాయల్,అంబాసిడర్ టైటిల్స్ కూడా పరిశీలనలో ఉంచారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి ఆ రేంజ్ లోనే టైటిల్ ఉండేలా మారుతి ప్లాన్ చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్ రాజా సాబ్ అని ఖరారు చేశారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news