ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్‌ఎస్ పనిచేస్తుందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ,జగదీష్‌రెడ్డి , ఎంపీ లింగయ్య యాదవ్ అన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలనే ధీమా కార్యకర్తలో ఉందని అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో భువనగిరి లోక్ సభ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాలల్లో అందించిన కేసీఆర్ ముఖ్య మంత్రి గా లేక పోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో ఉందని వారు ఆరోపించారు.
అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ నుంచి ఇప్పటి వరకు పథకాలపై స్పష్టత లేదని ఆయన అన్నారు. పథకాల అమలు కోసం కేసీఆర్ హాయంలో ఇన్ని అడ్డంకులు లేవని తెలిపారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకురావడానికి గట్టిగా కష్టపడతామని వివరించారు.బీఆర్ఎస్ కార్యకర్తల పై కాంగ్రెస్ పార్టీ దాడులను ఖండిస్తున్నట్లు తెలిపారు.