డబ్బు ఖర్చు పెట్టినవారు సేవ ఎలా చేస్తారు? జస్టిస్ జాస్తి చలమేశ్వర్

-

ఎన్నికల్లో కోట్లరూపాయల డబ్బు ఖర్చు పెట్టిన వ్యక్తి ప్రజలకు ఏవిధంగా సేవ చేస్తారని సుప్రీం కోర్టువిశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు.  సమాజం బాగుపడాలంటే ఎన్నికల వ్యవస్థలో మార్పురావాలి..అది యువత వల్లే సాధ్యమవుతుందన్నారు. ఆదివారం విజయవాడలో వివేకానంద యూత్‌అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ-విలువలతో కూడిన రాజకీయాలు’ అంశంపైనిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ.. స్వదేశానికిసేవ చేయడం కంటే కూడా పరాయి దేశానికి ఎక్కువ ప్రధాన్యత ఇవ్వడం నేడు రోజురోజుకిపెరిగిపోతుంది. అమెరికాలో స్వర్గం లేదని అక్కడా సమస్యలు ఉన్నాయన్నారు. అయితే అక్కడఉండే వసతులు మన దేశంలో ఎందుకు లేవో యువత ఆలోచించాలని కోరారు.

 ఎన్నికల్లో కనీసం రూ.25కోట్లు వెచ్చించి ఎమ్మెల్యే అయిన వ్యక్తి మనకు సేవ చేస్తారని ఎలా అనుకుంటామన్నారు.ఏడాది కిందట ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఒక ఎంపీ అభ్యర్థి ఎన్నికల్లో రూ.50కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ వివరించినప్పటికీ దాన్ని ఎవరూ పట్టించుకోలేదన్నారు. మహాత్మాగాంధీతాను తీసుకున్న నిర్ణయంతో కోట్ల మంది భారతీయులను ఏకంచేసి దేశం నుంచి ఆంగ్లేయులనుతరిమివేశారన్నారు. ఇదే స్ఫూర్తిని యువత అలవర్చుకుని వ్యవస్థలో గొప్ప మార్పుతీసుకొచ్చేలా వ్యవహరించాలన్నారు…  ఒక్కొక్కయువకుడు 10 మందిని ఓటు ప్రాముఖ్యతపై ఉత్తేజపరిస్తే దేశంమారుతుందని స్పష్టం చేశారు. అనంతరం ఓటు హక్కుపై వివేకానంద యూత్‌ అసోసియేషన్‌సైకిల్‌ యాత్రను జాస్తి చలమేశ్వర్‌ ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version