66 ఏళ్ల వయసులో బిడ్డను కన్న మహిళ.. కారణం తెలిస్తే మీరు షాకే.. !

-

Woman gave birth to test tube baby in her 66 age in gujarat

ఓ తల్లి తన 66 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటు చేసుకున్నది. అయితే.. ఆ తల్లి.. ఆ వయసులో బిడ్డను కనడం వెనుక పెద్ద విషాద ఘటన ఉంది. సూరత్‌కు చెందిన శ్యామ్‌బాయ్, మధుబెన్ దంపతులు తమ కొడుకు, కోడలుతో పాటు ఇతర బంధువులను కూడా రోడ్డు ప్రమాదంలో కోల్పోయారు. 2016లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అది. చెట్టంత కొడుకు తమ కళ్లముందే తమను వదిలి వెళ్లిపోతే ఆ తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు.

తర్వాత తమ కూతురు మనీషా వాళ్లకు టెస్ట్‌ట్యూబ్ బేబీ గురించి చెప్పింది. మరోసారి సంతానం పొందడానికి ప్రోత్సాహాన్ని అందించింది. అయితే.. మొదట మధుబన్ వ్యతిరేకించినప్పటికీ.. తర్వాత ఆలోచించి టెస్ట్ ట్యూబ్ బేబీని కనడానికి ఆ దంపతులు సిద్ధమయ్యారు. అలా.. తన 66 ఏళ్ల వయసులో మధుబెన్ పండండి బిడ్డకు జన్మనిచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version