డిసెంబర్‌ 10 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

కార్తీకమాసం- డిసెంబర్‌-10- గురువారం.

మేషరాశి:శుభవార్తలు అందుతాయి !

పనుల్లో విజయం. శుభవార్తలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి. ఊహించని ఆటంకాల కారణంగా పనులు  ముందుకు సాగవు. ఈ రోజు మీరు తెలియని వారినుంచి మద్దతు పొందవచ్చు. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలకు, ఉద్యోగాలకు సమస్యలు తీరతాయి. ఈ రోజు మీరు పనిలో శ్రద్ధ పెట్టడం అవసరం. ఏదైనా శుభవార్త మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీగురుచరిత్రపారాయణం చేయండి.

todays horoscope

వృషభరాశి:ఈరోజు ఆర్థికంగా నిరుత్సాహం !

ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కొన్ని ఆర్థిక, కుటుంబ సమస్యలు వస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. ఆఫీస్‌లో చిన్నచిన్న సమ్యలు రావచ్చు. పాత స్నేహితులను కలుస్తారు. దూరాశ పడకండి. ఉన్నంతలో ధర్మమార్గంలో సంపాదించండి. అనవసర వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీసంతోషిమాత ఆరాధన చేయండి.

​మిథునరాశి:ఈ రోజు మీకు గౌరవం పెరుగుతుంది !

ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు రావచ్చు జాగ్రత్త. కుటుంబ విషయాల్లో తల మునకలై ఉంటారు. ఈ రోజు మీకు గౌరవం పెరుగుతుంది. ఊహించని లాభాలను అందుకుంటారు చేపట్టిన పనులు, జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః ఓం నమః శివాయనమః అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

​కర్కాటకరాశి:వైవాహికంగా బాగుంటుంది !

ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కష్టపడిని పనిచేయడం వల్ల కావాల్సినంత ప్రయోజనం ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తీరతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీశివాష్టకం పారాయణం చేయండి.

​సింహరాశి:ఆర్థిక ఇబ్బందులు !

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు. ఈ రోజు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో విభేదాలు. ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. వ్యాపారం, వ్యాపారానికి సంబంధించిన అనుకూల వాతావరణం. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. పని ప్రదేశంలో మీ పనితీరు మెరుగుపడుతుంది. ఫలితంగా పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

పరిహారాలుః రుద్రాభిషేకం చేయించుకోండి.

​కన్యరాశి:ఈరోజు ఆర్థికంగా పురోగతి !

ఈరోజు ఆర్థిక విషయాలలో పురోగతి. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఈ రోజు మీరు తెలివిగా వ్యవహరించండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. బంధువులతో సత్సంబంధాలు. ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పిల్లల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. పరిహారాలుః శ్రీపార్వతీ మంగళాష్టకం పారాయణం చేయండి.

​తులరాశి:ఈరోజు దూరప్రయాణాలకు అవకాశం !

ఈరోజు అనుకున్న పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు. పని ప్రదేశంలో దూకుడుగా పనిచేయలేరు. అయితే ఉన్న సమస్యలను ఒకదాని తర్వాత మరోకటి పరిష్కరించుకోగలుగుతారు. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. సమయానికి అనుగుణంగా నడుచుకోవడం వల్ల మీరు అభివృద్ధి చెందుతారు.

పరిహారాలుః శ్రీరామ రక్షాస్తోత్రం పారాయణం చేయండి.

​వృశ్చికరాశి:ఈరోజు అనుకూలం !

ఈరోజు ఇంటాబయటా అనుకూలం. దాంపత్య జీవితంలో ఆనందం పెరుగుతుంది. లాభదాయకమైన వెంచర్లు కూడా అమలు చేయబడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. సంక్లిష్టమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లల గురించి ఆందోళన ఉంటుంది. పొరుగువారి వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చు.

పరిహారాలుః శివాభిషేకం చేయండి.

​ధనస్సురాశి:ఈరోజు ప్రముఖులతో పరిచయాలు !

ఈరోజు కొత్త ఉద్యోగావకాశం. ప్రముఖులతో పరిచయాలు. గృహంలో సమస్యలు తలెత్తుతాయి. కొంత కుటుంబ అశాంతి నెలకొంటుంది. కాబట్టి ముందుగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. శుభ వ్తార వింటారు. అనవసర ఖర్చులు చేయకండి. వైవాహిక జీవితం సాఫీగా ఉంటుంది.

పరిహారాలుః అనుకూల ఫలితాల కోసం శ్రీకృష్ణ అష్టకం పారాయణం చేయండి.

​మకరరాశి:ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి !

ఈరోజు ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళపరుస్తాయి. మీ ప్రణాళికలు, ప్రయత్నం ద్వారా అనుకున్న పనులు, వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల సహకారం కూడా ఉంటుంది. శ్రమాధిక్యం. అనారోగ్యం. బంధువులతో విభేదాలు.

కుటుంబ సమస్యలు తీర్చుకోవడంలో బిజీగా ఉంటారు. మీరు ఆలోచించే చేసే పనులు విజయవంతమవుతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకం తేనెతో చేయించండి.

​కుంభరాశి:ఈరోజు శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు !

ఈరోజు శ్రమకు ఫలితం కనిపించదు. ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. లాభం వస్తుందనే నమ్మకంతో పనిచేయండి. ఆస్తి వివాదాలు నెలకొనవచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి. పనులు ముందుకు సాగవు. వైవాహికంగా సాఫీగా, సంతోషంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీశివాభిషేకం వస్తుంది.

​మీనరాశి:ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు.

ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ రోజు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. దైవచింతన. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. ఆర్థిక కారణాల వల్ల మీ జీవిత భాగస్వామి మీకు దూరమవుతారు. కుటుం జీవితం సంతోషంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీసూక్త పారాయణం చేయండి.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news