అంగరంగ వైభవంగా మెగా డాటర్ నిహారిక పెళ్లి

-

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లాడింది నిహారిక. సాయంత్రం సరిగ్గా 7:15 నిమిషాలకు మెగా ఫ్యామిలీ సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది. నిహారిక పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి సహా మరికొంత మంది హాజరయ్యారు. నిహారిక పెళ్లి చేసుకున్న చైతన్య జొన్నలగడ్డ విషయానికొస్తే.. ఈయన గుంటూరు ఐజీ ప్రభాకర రావు తనయుడు.


తొలిరోజు సంగీత్ సందర్భంగా కాబోయే వధూవరులతో పాటు మెగా హీరోలు స్టెప్పులేసి సందడి చేశారు. మెగా ప్రిన్సెస్ నిహారిక పెళ్లి వేడుకలో చిరు ఫ్యామిలీ హీరోలంతా సందడి చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కాస్త ఆలస్యంగా జాయిన్ అయ్యారు. అందరూ కలిసి దిగిన గ్రూప్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. నిహారికతో కలిసి అన్నయ్య రామ్ చరణ్‌ పాటలకు స్టెప్పులేశాడు. మధ్యమధ్యలో బన్నీ.. తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్స్‌తో చిందులేసి అలరించాడు.మామయ్య నాగబాబుతో కలిసి అల్లు అర్జున్‌ హంగామా చేస్తున్న మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/p/CIlG_NRl6VM/?utm_source=ig_web_copy_link

తన చిట్టి చెల్లెల్ని అన్నయ్య వరుణ్ తేజ్‌ భుజాలపై మోసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తను ఎంతగానో ఇష్టపడే నిహారికకు చిరంజీవి ఖరీదైన బహుమతిని ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు కోట్ల రూపాయ‌ల విలువైన ప్రత్యేక‌ ఆభ‌ర‌ణాన్ని నిహారికకు అందించారట చిరు. పెళ్లి సందర్భంగా చిరంజీవి ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు నిహారికను ఎత్తుకున్న ఫొటోతో పాటు, ఇటీవల పెళ్లి కుమార్తెను చేసిన తర్వాత దిగిన సెల్ఫీని కలిపి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు మెగాస్టార్.

Read more RELATED
Recommended to you

Latest news