ఈ సంవత్సరం వేసవిలో ఎన్నడూలేని విధంగా నీటి కొరతను ఎదుర్కొన్న ఢిల్లీకి ఇటీవల మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరట కల్పించాయి..దీంతో కొన్ని ఏరియాల్లో తాత్కాలికంగా నీటి సమస్య తీరిపోయింది. ఈ క్రమంలో మంత్రి అతిషి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన చంద్రవాల్ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోని పంప్‌హౌస్‌ను ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని, తిరిగి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.అనూహ్య వర్షాల వల్ల ఈ ప్లాంట్‌లో మోటార్లు దెబ్బతినడంతో సెంట్రల్ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి జల్ బోర్డు త్వరగా పనిచేసింది. ప్లాంట్ దాదాపు 80 శాతం మరమ్మతులకు గురైంది. నీటి సరఫరా త్వరలో సాధారణ స్థితికి వస్తుందని అతిషి తెలిపారు. ఇటీవల శుక్రవారం ఢిల్లీలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.