తన కాన్వాయ్‌ని SFI అడ్డగించడంపై గవర్నర్‌ ఆగ్రహం….

-

గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కు,అక్కడి ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు మరింత తీవ్రమవుతోంది. గవర్నర్ అరిఫ్  మహమ్మద్ ఖాన్ గారు శుక్రవారం జరిగిన 75వ గణతంత్ర దినోత్సవం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కేవలం 78 సెకండ్లు మాత్రమే ప్రసంగించారు. గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన 60 పేజీల ప్రసంగాన్ని చదవకుండా పక్కనపడేశారు. దాంతో రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌ హోమ్‌ను పినరయి విజయన్‌ సర్కారు బహిష్కరించింది. కొల్లామ్‌లో శనివారం ఉదయం గవర్నర్ కాన్వాయ్ కి SFI ఆందోళనకారులు అడ్డు తగిలారు. గవర్నర్ యూనివర్సిటీ ఛాన్సెలర్ల నియామకానికి అడ్డు పుల్ల వేస్తున్నాడంటూ నల్ల జెండాలు ప్రదర్శించారు.దాని ఆగ్రహించిన గవర్నర్ కారు దిగి ఆందోళన కారుల వైపు దూసుకెళ్లారు.

గవర్నర్ కు రక్షణ హ్యూమన్ షిన్లు ఏర్పాటు చేశారు. SFI కార్యకర్త పోలీసుల వల్లే తన కాన్వాయ్ కి అడ్డు వచ్చారని అన్నాడు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డు ప్రక్కన ఉన్న ఛాయ దుకాణం ముందు బైటాయించారు. గవర్నర్ గారు ఆందోళన కారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఘటనకు సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్టు చేశామన్నారు. 50 మందికి పైగా అడ్డు తగిలితే 12 మందిని ఎందుకు అరెస్టు చేశావని గవర్నర్ ప్రశ్నించారు.ఆందోళనకారుల అరెస్ట్‌లకు సంబంధించి FIR కాపీలు చూపించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version