తన కారును ఓవర్‌టేక్ చేశారని ఇద్దరిని చితకబాదిన తహసీల్దార్…..

-

మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో తన కారును ఓవర్‌టేక్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితకబాధారు. వివరాలలోకి వెళితే …ఎస్డీఎం అమిత్ సింగ్, తహసీల్దార్ వినోద్ కుమార్ వారి సహచరులతో కలిసి ప్రభుత్వ వాహనంలో వెళ్తుండగా వెనుక నుంచి ఓ వ్యక్తి వారిని చేశాడు. దీంతో ఎస్డీఎం అమిత్ సింగ్, తహసీల్దార్ వారి డ్రైవర్లతో కలిసి యువకుల వాహనం ఆపి  వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎస్డీఎం కర్రతో ఓ వ్యక్తిని కొట్టగా  ఆ వ్యక్తి తలకు గాయమైంది.

బాధితులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కొత్వాలి పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ చంద్ర మిశ్రా దాడికి పాల్పడ్డ ఎస్డీఎం అమిత్ సింగ్, తహసీల్దార్ వినోద్ కుమార్, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై సీఎం మోహన్‌ యాదవ్‌ స్పందిస్తూ…సామాన్యులపై అమానవీయంగా ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వం సహించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బాంధవ్గడ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news