మందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం రేపటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనుంది. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించనుంది. ఇందులో భాగంగా తొలిరోజు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఎన్నికల కోడ్ అమలుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తనిఖీల గురించి ప్రధానంగా చర్చించనున్నారు. 23న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో, 24న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ సంబంధిత వివరాలను నియోజకవర్గాల వారీగా గణాంకాలను సిద్ధం చేసుకున్నారు.