తెలంగాణలో73.2 శాతం పోలింగ్..

-

తెలంగాణఅసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్కుమార్ స్పష్టతనిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 73.2శాతంపోలింగ్‌ శాతం నమోదైందన్నారు. పోలింగ్ ముగిసిన దాదాపు 24 గంటల సమయం తర్వాత ఈశాతాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారంరాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగియగా.. 69.1శాతానికిపైగా పోలింగ్‌ నమోదైనట్టురాష్ట్ర ఈసీ ప్రకటించారు. అయితే, రాత్రి10.30గంటల తర్వాతా కొన్ని కేంద్రాల్లోపోలింగ్‌ జరిగింది దీంతో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర ఈసీ కార్యాలయానికి నివేదికలుఅనుకున్న సమయానికి చేరలేదు. దీంతో పోలింగ్ శాతం మదింపుపై శనివారం రాత్రి వరకుకసరత్తు చేశారు. అత్యధిక యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.95 శాతం నమోదు కాగా…హైదరాబాద్లో 48.89 శాతంగా నమోదైందన్నారు.

కామారెడ్డి – 83.05 ,  మంచిర్యాల – 78.72 ,  ఆదిలాబాద్‌ – 83.37 , నిర్మల్‌ – 81.22 
నిజామాబాద్‌ – 76.22 , జగిత్యాల – 77.86 , పెద్దపల్లి – 80.58 , కరీంనగర్‌ – 78.20 
రాజన్న సిరిసిల్ల – 80.49 , సంగారెడ్డి – 81.94 ,సిద్దిపేట – 84.26 ,రంగారెడ్డి – 61.29 
వికారాబాద్‌ – 76.87 , మేడ్చల్‌ – 55.85 ,మెదక్‌ – 88.24, హైదరాబాద్‌ – 48.89 
మహబూబ్‌నగర్‌ – 79.42 , నాగర్‌ కర్నూలు – 82.04, వనపర్తి – 81.65 
జోగులాంబ గద్వాల – 82.87 ,నల్గొండ – 86.82,సూర్యాపేట – 86.63 
యాదాద్రి భువనగిరి – 90.95 ,జనగామ – 87.39,మహబూబాబాద్‌ – 89.68 
వరంగల్‌ రూరల్ – 89.68 వరంగల్‌ అర్బన్‌ – 71.18 , జయశంకర్‌ భూపాలపల్లి – 82.31 
భద్రాద్రి కొత్తగూడెం – 82.46 ఖమ్మం – 85.99 

Read more RELATED
Recommended to you

Latest news