టైటిల్ చూసి ఆశ్చర్యపోయారా? పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఫ్రీగా ఎవరిస్తారు అని ఆవేశపడకండి. అది నిజమే. ముమ్మాటికీ నిజమే. కాకపోతే యూరప్ దేశం లక్సంబర్గ్ లో.
ప్రపంచం మొత్తం ఇప్పుడు కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. అది ఏ కాలుష్యమైనా పర్యావరణానికి హాని కలిగించేదే. దీంతో జీవ వైవిధ్యం మొత్తం దెబ్బ తింటుంది. ఇక.. లక్సంబర్గ్ లో వాయు కాలుష్యం ఎక్కువైపోయిందట. ప్రతి ఒక్కరు తమ సొంత వాహనాలను ఉపయోగించడం.. ప్రజా రవాణాను పట్టించుకోకవపోడం వల్ల వాయు కాలుష్యంతో పాటు విపరీతంగా ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు.
వీటన్నింటికీ చెక్ పెట్టడానికే… లక్సంబర్గ్ ప్రభుత్వం ఈ వినూత్నమైన ఆలోచనచేసింది. 2020 నుంచి దేశంలో ఉచితంగా బస్సులు, రైళ్లు, ట్రామ్ సర్వీసులనునడిపించనున్నట్లు ప్రకటించింది. ఉచితంగా పబ్లిక్ సర్వీసులను నడిపించడం వల్ల సొంతవాహనాల వాడకం తగ్గుతుందని.. దీంతో కొంత వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని,ట్రాఫిక్ ను కూడా అదుపులో ఉంచుకోవచ్చని లక్సంబర్గ్ ప్రధాని గ్జేవియర్ బెటెల్అన్నారు. లక్సంబర్గ్ చిన్న దేశమే. జనాబా ఇంచుమించు 6 లక్షలు ఉంటుంది. అక్కడ ప్రతివెయ్యి మందికి 647 కార్లు ఉన్నాయట. 2020 లో ఇది సుసాధ్యం అయితే.. ప్రపంచంలోనే ఉచితంగా ప్రజా రవాణాను అందించిన మొట్టమొదటి దేశంగా లక్సంబర్గ్ చరిత్రకెక్కుతుంది.