బాలయ్య సరసన మిల్కీ బ్యూటీ….?

-

నందమూరి బాలకృష్ణకు గత రెండేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ వరుస హిట్స్ తో సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. కుర్ర హీరోలకి పోటీ ఇవ్వడమే కాకుండా ఇటీవల 100 కోట్ల మార్క్ ని అందుకున్నడు. సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ…. పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం బాలయ్య బాబు బాబి దర్శకత్వంలో తన 109వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా ఈ చిత్రానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది.

ఇప్పుడు తన సినిమాలలో ఐటెం సాంగ్స్ ని ప్లాన్ చేసే దర్శకుడు బాబి ఈ సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్ ని చిత్రీకరించబోతున్నాడట. ఈ ఐటమ్ సాంగ్ కొరకు మిల్కీ బ్యూటీ తమన్నా తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు సినీ ఇండస్ట్రీలో టాక్. అయితే తమన్నా కూడా పాజిటివ్ గానే స్పందించిందని కానీ రెమ్యూనరేషన్ మాత్రం దాదాపు రెండు కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని సమాచారం. మరోవైపు శృతిహాసన్ పేరు వినిపిస్తున్నప్పటికీ మిల్కీ బ్యూటీ చేసిన అన్ని సాంగ్స్ హిట్ కావడంతో ఎక్కువగా తమన్నా ని తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news