దక్షిణాఫ్రికా తో జరగబోయే టెస్ట్ సిరీస్ కి దూరం కానున్న మరొక కీలక ఆటగాడు…..

-

ప్రస్తుతం భారత్ దక్షిణాఫ్రికా టూర్ లో ఉన్నది. ఇందులో భాగంగా ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతుంది. అయితే ఈ సిరీస్ ముగిశాక జరిగే టెస్ట్ మ్యాచ్ లకి టీమిండియా ఆటగాడు దూరం అయినట్లు సమాచారం. అయితే ఇషాన్ కిషన్ ఈ టెస్ట్ సిరీస్ కి అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐకి స్పష్టం చేశాడు. దీంతో ఇతని స్థానంలో కె ఎస్ భరత్ ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇదివరకే గాయం కారణంగా షమీ దూరమైన విషయం తెలిసింది. ఇషాన్ కిషన్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్లనే ఈ సిరీస్ కు దూరంగా ఉంటున్నాడని బీసీసీఐ తెలిపింది.

డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రెండవ టెస్టు మ్యాచ్ జరుగును.

 

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ, కేఎస్ భరత్ (వికెట్ కీపర్).

Read more RELATED
Recommended to you

Latest news