దూబే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన.. జితేశ్‌ మెరుపులు.. తొలి టీ20 భారత్‌దే..

-

మొహాలీ ఫస్ట్ ట్20:   స్వదేశంలో అఫ్గానిస్తాన్ తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇండియా విజయంతో ఆరంభించింది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 159 రన్స్ లక్ష్యాన్ని ఇండియా.. 17.3 ఓవర్లలో కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.జితేశ్‌ శర్మ (20 బంతుల్లో 31, 5 ఫోర్లు), శివమ్‌ దూబే (40 బంతుల్లో 60 నాటౌట్‌, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (22 బంతుల్లో 26, 2 ఫోర్లు, 1 సిక్సర్‌) రాణించడంతో ఇండియా బోణీ చేసింది.

ఐపీఎల్‌లో మొహాలీ పిచ్‌పై పదుల సంఖ్యలో మ్యాచ్‌లు ఆడిన జితేశ్‌ శర్మ.. అఫ్గానిస్తాన్ బౌలర్లపై చెలరేగిపోయాడు.14 నెలల తర్వాత టీ20లలోకి రీఎంట్రీ ఇచ్చిన హిట్ మ్యాన్ రనౌట్‌ అయి నిరాశపరిచినా యువ బ్యాటర్లు మాత్రం ఇండియాకి గెలుపును అందించారు. బ్యాటింగ్‌లో రాణించిన దూబే.. బౌలింగ్‌లోనూ 2 ఓవర్లు వేసి తొమ్మిది రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ ను పడగొట్టాడు. ఇండియా, అఫ్గనిస్థాన్  మధ్య రెండో టీ20 ఈనెల 14న ఇండోర్‌ వేదికగా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news