నగరంలో రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు…

-

హైదరాబాద్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా అక్టోబరు 24, 26 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.

ట్రాఫిక్ ఆంక్షలు గల ప్రాంతాలు…

బుధవారం (అక్టోబరు 24) మధ్యాహ్నం 12.25 నుంచి 1.10 గంటల వరకు బేగంపేట ఎయిర్‌పోర్టు, శ్యాంలాంల్‌ బిల్డింగ్‌, బేగంపేట ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ జంక్షన్‌, సీఎం క్యాంప్‌ ఆఫీస్‌, రాజ్‌భవన్‌, వీవీ విగ్రహం జంక్షన్‌, ఖైరతాబా ద్‌ ఫ్లైఓవర్‌, నెక్లెస్‌ రోటరీ, తెలుగుతల్లి జంక్షన్‌, అంబేద్కర్‌ విగ్రహం, లిబర్టీ, పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం, నిజాం కాలేజీ గేట్‌-4, భారతీయ విద్యాభవన్‌ వరకు.

బుధవారం మధ్యాహ్నాం 1.45 నుంచి 2.30 గంటల వరకు భారతీయ విద్యాభవన్‌ నుంచి నిజాం కాలేజీ, రాజ్‌భవన్‌, మోనప్ప జంక్షన్‌, సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ యూ టర్న్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, శ్రీనగర్‌ టి జంక్షన్‌, సాగర్‌సొసైటీ, ఎన్‌టిఆర్‌ భవన్‌ జంక్షన్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, ఉషాకిరణ్‌ టి జంక్షన్‌, పెద్దమ్మ టెంపుల్‌, రోడ్‌నెం. 36/10 జంక్షన్‌, జీహెచ్‌ఎంసి పార్క్‌ యూ టర్న్‌, రోడ్‌ నెం. 36/31, రోడ్‌ నెం. 31/29, రోడ్‌ నెం. 29, జూబ్లీహిల్స్‌ ఇంటి వరకు.

శుక్రవారం రోడ్‌ నెం. 29 ఇంటి నుంచి రోడ్‌ నెం. 31/29, పెద్దమ్మ టెంపుల్‌, ఉషాకిరణ్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, ఎన్‌టిఆర్‌ భవన్‌, టి జంక్షన్‌, నాగార్జున సర్కిల్‌, పంజాగుట్ట ఫ్లైఓవర్‌, సిఎం క్యాంప్‌ ఆఫీస్‌, గ్రీన్‌ల్యాండ్స్‌ ఫ్లై ఓవర్‌, బేగంపేట ఎయిర్‌పోర్టు వరకు ఆంక్షలుంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news