దుబాయ్ పర్య టనలో ఏపీకి భారీ పెట్టుబడులు తీసుకువస్తున్నట్టు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. ఖాళీ కుర్చీలకు ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడానికి అబుదాబి వరకు వెళ్లాలా మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పీచ్‌కే హైలెట్ అని లోకేష్ విమర్శలు చేసారు. చెత్తపాలన, బెదిరింపుల దెబ్బకు ఇతర రాష్ట్రాలకు పారిపోతున్న కంపెనీలు మీ ఘనత గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని లోకేష్ మండిపడ్డారు.
కంపెనీలు తెచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీకు ఎలాగో చేతకాదు. కనీసం ఉన్న కంపెనీలు పోకుండా చూడండి అదే రూ.10వేలు అంటూ లోకేష్ హితవు పలికారు. దుబాయ్‌లో పర్యటనలో మూడువేల కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు సంస్థలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నట్టు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. పలు కంపెనీలు ఏపీలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి మేకపాటి వివరించారు. లండన్‌కు చెందిన కాజస్ ఈ మొబిలిటి ప్రయివేటు లిమిటెడ్ సంస్థతో పాటు రీజెన్సీ గ్రూప్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని ఆయన తెలిపారు.