ఏపీ డీజీపీ : విధేయుడే కానీ ఎందుకని విరోధి అయ్యాడు?

-

ఆయ‌న ఎంతో విధేయుడు..స‌ర్కారు ఏం చెబితే అదే చేసి మంచి మార్కులు కొట్టేసేందుకు ఎంత‌గానో ప్ర‌య‌త్నించిన మంచి ప‌రిపాల‌న ద‌క్ష‌త ఉన్న విమ‌ర్శ‌ల‌కు అస్స‌లు అంద‌ని అంతుపోల‌ని, అస్స‌లు విమ‌ర్శ‌ల‌నే ప‌ట్టించుకోని పోలీసు ఉన్న‌తాధికారి.అటువంటి అధికారిని ఏపీలోనే కాదు యూపీలో కూడా చూడం. క‌నుక‌నే నిన్న‌టివేళ చెప్పాపెట్ట‌కుండా బ‌దిలీ పేరిట పోస్టింగ్ కూడా ఇవ్వ‌కుండా రిజ‌ర్వులో ఉంచారు.ఆయ‌నే గౌత‌మ్ స‌వాంగ్. ఏపీ డీజీపీ నిన్న‌టి వ‌ర‌కూ మాత్ర‌మే!

ఆంధ్రావ‌నిలో పోలీస్ బాస్ గౌత‌మ్ స‌వాంగ్ ను అనూహ్య రీతిలో సీఎం త‌ప్పించి,ఆ పోస్టు కాస్త రాజేంద్ర‌నాథ్ రెడ్డికి ఇచ్చారు.దీంతో ఈ విష‌యం కాస్త చ‌ర్చ‌కు తావిస్తోంది.మొద‌ట నుంచి గౌత‌మ్ స‌వాంగ్‌ అత్యంత విధేయుడిగానే పేరు తెచ్చుకున్నారు.ప‌లు ప్ర‌జా ఉద్య‌మాల‌ను అణిచివేశారు.విప‌క్షాలకు చెందిన నాయ‌కుల‌ను,కార్య‌క‌ర్త‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ట‌డి చేశారు.ఎన్నో ప్ర‌జా సంఘాల ఆందోళ‌న‌ల‌ను నిలువ‌రించి మ‌రియు నియంత్రించి విజ‌య‌వాడ వాకిట సంబంధిత వ‌ర్గాలు అస్స‌లు గొంతెత్త‌నీయ‌కుండా చేశారు.అటువంటి డీజీపీని ఏపీ స‌ర్కారు త‌ప్పించి పెద్ద త‌ప్పిద‌మే చేసింది.

అంత‌టి విధేయుల‌కు పోస్టులోఉంచకుండా హూస్టింగ్ ఆర్డ‌ర్ ఇచ్చేసింది.పాపం ఆయ‌న ఇప్పుడెక్క‌డికి వెళ్లాలి.ఎవ‌రిని క‌ల‌వాలి.ఆయ‌న ఆదేశాలు మేర‌కు న‌డుచుకునే పోలీసులు అంతా ఇప్పుడు ఆయ‌న ప‌రిస్థితిని త‌లుచుకుని విస్మ‌యం చెందుతున్నారు.రాజ‌ధానిలో రైతు ఉద్య‌మాలు అణిచివేసిన సంద‌ర్భాల్లోనూ ఆయ‌నే గెలిచారు.పాపం నాటి  రైతుల‌ను ఉక్కుపాదంతో అణిచిన సంద‌ర్భాల్లోనూ ఆయ‌నే గెలిచారు.ఏనాడూ ఆయ‌న రైతుల ప‌క్ష‌పాతిగా నిల‌వ‌లేదు.అదేవిధంగా గంజాయి క‌ట్ట‌డిలో సంబంధిత ర‌వాణాను అడ్డుకోవ‌డంలో, మాద‌క ద్ర‌వ్యాల రవాణాను అడ్డుకోవ‌డంలో, నేరాల నియంత్ర‌ణ‌లో కూడా ఆయ‌న విఫ‌లం అయ్యారు.ఇవ‌న్నీ లా అండ్ ఆర్డ‌ర్ విఫ‌లం అయ్యేందుకు, ఆయ‌న నియంత్ర‌ణ‌లో పోలీసు శాఖ లేద‌ని చెప్పేందుకు ఓ స‌హేతుక‌కు తూగే ఉదాహ‌ర‌ణలు.

Read more RELATED
Recommended to you

Latest news