తెలంగాణ ప్రభుత్వం 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శల పోస్టుల నియామకం కోసం చేపట్టనున్న పరీక్షను నేడు నిర్వహించనున్నారు. మొన్న జరిగినటువంటి గ్రూప్ -4 ప్రశ్న పత్రం మాదిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాసరాజ్ తెలిపారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ప్రశ్న పత్రాలను జంబ్లింగ్ కోడ్ విధానంలో రూపొందించామన్నారు. మొత్తం 9,355 పోస్టులకు 5.61 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని… రాష్ట్రవ్యాప్తంగా 1,288 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే సమయంలో.. వారి మత, ఆచారాల సెంటిమెంట్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు, పరీక్ష కేంద్రాల ఇన్ చార్జ్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.