గత నెలలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో శబరిమలలోని అయ్యప్ప ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలు అయ్యప్ప దర్శనానికి అనుమతిస్తూ… ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ అంశంపై ఎప్పుడు విచారిస్తామనే అంశాన్ని మంగళవారం నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్కే కౌర్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. సుప్రీం తీర్పు కారణంగా కొంత మంది మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల వెళ్లగా భక్తులు, ఆలయ అర్చకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే.