నేను దేశానికి ఆడాలనేది నాన్న క‌ల‌.. లెఫ్ట్ హ్యాండ‌ర్‌గా ఎందుకు మారానంటే..? : మంధాన‌

-

భారత మహిళల క్రికెట్ టీం స్వదేశంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల పై గెలిచి చరిత్ర తిరగరాసింది. ఈ విజయాలలో ఓపెనర్ స్మృతి మందాన పాత్ర మరువలేనిది. గత ఏడు సంవత్సరాలుగా ఇండియన్ టీంకి వెన్నెముకగా నిలుస్తున్న మందాన కౌన్ బనేగా కరోడ్పతి షోలో తన జర్నీ గురించి వెల్లడించింది. నా చిన్నతనంలో మా నాన్న అలాగే మా అన్నయ్య క్రికెట్ ఆడుతూ ఉంటే గమనించేదాన్ని. క్రికెట్ అంటే ఎంతో ఇష్టమైన మా నాన్నని క్రికెట్ ను ఆప్షన్ గా ఎంచుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో అప్పటి నుంచే మా నాన్న కుటుంబంలో ఎవరైనా ఒకరు దేశం తరఫున ఆడాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. ఆయనే కోరుకున్నట్టుగానే నేను ఇండియన్ క్రికెట్ టీమ్ లో స్థానం సంపాదించడంతో చాలా సంతోష పడ్డారని మందాన తెలిపింది.

 

తాను మొదట్లో రైట్ హ్యాండ్ బ్యాటర్ కానీ అన్నయ్య ఆడడాన్ని చూసి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా మారానని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు స్మృతి మందాన 80 వ‌న్డేలు, 6 టెస్టులు,125 టీ20లు ఆడింది. వ‌న్డేల్లో 3,179 రన్స్, టెస్టుల్లో 480 ప‌రుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news