పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి.. ఐదు జిల్లాల మంత్రులతో సీఎం రేవంత్

-

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపునకు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఈరోజు ఐదు జిల్లాల ఎమ్మెల్యేలు,ఇన్‌చార్జి మంత్రులతో సమావేశం అయ్యారు. జనవరి 26 తర్వాత జిల్లాల్లో పర్యటన చేపట్టనున్నారు .ఎమ్మెల్యేలకు సచివాలయంలో వారానికి మూడు రోజులు సాయంత్రం 4 నుంచి 6 వరకు అందుబాటులో ఉంటానన్నారు. గతంలో ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో తొలిసభను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే నిర్వహించారు.

తాజాగా సీఎం గా బాధ్యతలు చేపట్టాక తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించి ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనం కోసం శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.పార్లమెంట్‌ ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేసి17 లోక్‌సభ స్థానాల్లో 12కు తగ్గకుండా విజయం సాధించాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news