ట్రైలర్ చూసి కిక్కు సరిపోక.. టెకిలా కొట్టి వచ్చా: విశ్వక్ సేన్

-

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ చిత్రంలో నేహాశెట్టి కథానాయికగా నటిస్తోంది.తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ విడుదలైంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో ‘మనుషులు మూడు రకాలురా.. ఆడాళ్లు, మగాళ్లు, రాజకీయ నాయకులు’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా విశ్వక్ సెన్ మాట్లాడుతూ… ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ చూసి కిక్కు సరిపోక, టెకిలా కొట్టి వచ్చానని అన్నారు.

అక్కడక్కడ మూసివేసిన థియేటర్లు ఈ సినిమాతో కళకళలాడాలని చెప్పారు. ఈ నెల 28న ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ బాలకృష్ణ రానున్నట్లు హింట్ ఇచ్చారు. ట్రైలర్లోని డైలాగులు చెబుతూ అభిమానులను హుషారెత్తించారు.కాగా, సినిమాలో అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news