ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హమీలను నెరవేర్చాలి – సబితా ఇంద్రారెడ్డి

-

నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు దళిత బంధుతో పాటు అనేక పథకాలను ప్రవేశపెట్టి పేదలను ఆదుకున్నరని అన్నారు.కేసీఆర్‌ కందుకూరు వరకు మెట్రో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు అని తెలిపింది.

మెట్రో , ఫార్మాసిటీ ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం సరి కాదని అన్నారు. ఫార్మాసిటిని రద్దు చేస్తే ఆ భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ….ప్రజాపాలన లో ప్రజలు అప్లై చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ గ్రామ సభల్లో బ్యానర్లను కడితే ఊరుకోమని హెచ్చరించారు.

రైతు బంధు ను అకౌంట్ లోకి వేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే 9వ తేదీ నుంచి రూ,15వేల ఇస్తామన్న హామీని మరిచిపోయారని ఆరోపించారు. ఆరుగ్యారెంటీలతో పాటు 400 పథకాలకు సంబంధించిన హమీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news