ప్రభుత్వం ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దు: హరీశ్‌ రావు

-

మహా లక్ష్మి పథకం అమలు చేయడం ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డున పడేసిందని హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నాయని ఆయన అన్నారు. ఆటో కార్మికులకు ప్రతి నెల రూ.15 వేల జీవన భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే వారు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు.సిద్దిపేట జిల్లా డిగ్రీ కాలేజ్ మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోకార్మికులు కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ,ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలని అన్నారు. ప్రభుత్వం ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దని సూచించారు.

ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమమే అయినప్పటికీ.. ప్రజలు బస్సులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. మారుమూల గ్రామాలకు మరిన్ని బస్ సౌకర్యాలు పెంచాలని కోరారు. ఆటోవాలలా జీవితంలో పండుగ వాతావరణం కనుమరుగైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు గట్టెక్కుతాయని అనుకున్నారని, కానీ ఇలా రోడ్డున పడతామని వారు అనుకోలేదంటున్నారని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news