రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రైతులకు రాష్ట్ర సర్కార్ సాగు నీరు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వైరీని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రం ఎడారిగా మారిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లలో 30 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని, వాటితో 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వొచ్చని ఆయన స్పష్టం చేశారు.
సాగు నీటి విడుదలకు సంబంధించిన నిర్ణయం తీసుకోకుండా భూములు పడావు పెట్టారని, రైతులపై ఎందుకంత కోపమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీళ్లను ఆయకట్టుకు ఇచ్చి, యాసంగిలో పంటల దిగుబడి తగ్గకుండా చూడాలని తెలిపారు. తాగు నీటి పేరుతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద క్రాప్ హాలిడే ఇచ్చారని విమర్శించారు.సంక్షేమ పథకాల అమల్లో దళారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు.