తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ చీరల్ని పంచేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వానికి ఈసీ షాకిచ్చింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే నేతన్నలతో తయారుచేయించిన ప్రత్యేక చీరలను ఇప్పటికే 50 లక్షల చీరల్ని తరలించారు… మరో 45 లక్షల చీరలు తరలించేందుకు సిద్ధమవుతుండగా ఈసీ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాల పాత్ర ఎక్కువగా ఉంది.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చీరల పంపిణీ అనుమతి నిరాకరించింది. నాలుగైదు రోజుల్లో చీరల పంపిణీకి సిద్ధమవుతున్న వేళ తెలంగాణలో ఆడపడుచులకు అందించే చీరలను సైతం ప్రతిపక్షాలు రాజకీయానికి వాడుకుంటున్నారనే చర్చకొనసాగుతుంది.